Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Updated : 09/06/2021 03:29 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

సకాలంలో పనులను పూర్తి చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రీ రామ నామ జపం శ్రేయోదాయకం.

మధ్యమ ఫలితాలున్నాయి. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి.  సమయం వృథా చేయకండి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం శుభప్రదం.

మంచి పనులు చేపడతారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. లింగాష్టకాన్ని పఠిస్తే బాగుంటుంది.

సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

చిత్తశుద్ధితో చేసే పనులు మంచినిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోకూడదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేయకూడదు. నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది.

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వైరాగ్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా నామాన్ని జపించడం ఉత్తమం.

మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మిశ్రమ కాలం. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం పెరగటానికి లక్ష్మీ ధ్యానం శుభప్రదం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శివుడిని ఆరాధిస్తే అన్ని రకాలుగా మంచిది.

మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.

అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇష్టదేవతా శ్లోకం చదవాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని