Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Published : 07/07/2021 03:59 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టులతో కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచింది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.

మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ద్వాదశ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో  తగిన జాగ్రత్తలు అవసరం. దత్తాత్రేయుని ఆరాధన శుభ ఫలితాన్నిస్తుంది.

సౌభాగ్య సిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం లభిస్తుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.

దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. స్వకులాచారం ఉంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధన లాభం పొందుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభదాయకం.

చేపట్టిన కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. శుభ ఫలితాలు సొంతమవుతాయి. అతిగా ఎవ్వరినీ విశ్వసించవద్దు. శ్రీరామనామాన్ని జపిస్తే శ్రేయోదాయకం.

జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ఆపదలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహాలు సూచితం. ఆవేశాలకు పోవద్దు. శ్రమ అధికమవుతుంది. పనుల్లో విజయం కోసం లింగాష్టకం చదవాలి.

కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సాయి చరిత్ర పారాయణ చేయండి.

సర్వత్రా విజయసిద్ధి కలదు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ నామస్మరణ చేస్తే మంచిది.

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయవద్దు. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

మధ్యమ ఫలితాలున్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకుపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. శివుడిని ఆరాధిస్తే శుభదాయకం.

కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఇష్టదైవారాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని