Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Updated : 08/06/2021 04:24 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కీలక విషయాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక వాటిని కొన్నాళ్లు వాయిదా వేసుకుంటేనే మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్ట దైవారాధన మేలు.

మంచి ఫలితాలు పొందేందుకు సరైన అవకాశం. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇష్టదేవాన్ని ప్రార్థిస్తే మంచిది. 

మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా.. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం వలన శుభం కలుగుతుంది.

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి సందర్శనం మంచినిస్తుంది.

అనుకూల ఫలితాలు కలవు. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్య అనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన మంచిది.

మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

స్థిరమైన నిర్ణయాల్లో ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ విష్ణు నామాన్ని పఠించడం మంచిది.

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది.  అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవారాధన మేలు. 

మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ఆత్మవిశ్వాసం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి. శని శ్లోకం పఠిస్తే మంచిది. 

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. మానసిక ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించడం వలన శుభఫలితాలు పొందుతారు. 

మీ మీ రంగాల్లో విజయసిద్ధి ఉంది. ఒక విషయంలో సంతోషాన్ని పొందుతారు. ఆర్థికపరంగా మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని