Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Published : 14/06/2021 03:59 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్


ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో ఊహించని ఫలితాలు వస్తాయి. అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించాలి.  

ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మనస్సౌఖ్యం కలదు. ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పఠించాలి.

మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మీ మీ రంగాల్లో చక్కటి శుభయోగం ఉంది. శరీర సౌఖ్యం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

చేసే పనిలో మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. శారీరక సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆదిత్య హృదయం పఠించాలి.

 కొత్త ఆలోచనలను ఆచరణలో పెడతారు. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రులను ఆదరిస్తారు. శుభవార్తలు వింటారు. పెద్దల ఆశీస్సులు అండదండలు లభిస్తాయి.  ఇష్టదేవతా నామస్మరణ మంచినిస్తుంది.

అనుభవజ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది. ధనలాభం కలుగుతుంది. సంతోషంగా ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి సందర్శనం మేలు చేస్తుంది.

మీ మీ రంగాల్లో  మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  కొన్ని వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. చేపట్టిన పనులను పూర్తిచేయడంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. ఒకరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. సూర్యాష్టకం చదివితే ఇంకా బాగుంటుంది.

నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలను పెడచెవిన పెట్టరాదు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలదు. చిరునవ్వుతో అనేక సమస్యలు దూరమవుతాయని గుర్తించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.

మొహమాటంతో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోరాదు. చెడు సావాసాలు చేయరాదు. కీలక  విషయాల్లో అశ్రద్ధగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఆశించిన ఫలితం దక్కుతుంది. ఆదాయం కంటే వ్యయం మించకుండా చూసుకోవాలి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలనిస్తుంది.

సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉంటారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అనూహ్యమైన ఆర్థిక ప్రయోజనాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు.

ఉత్సాహంగా ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుపుకోవాలి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత కోసం  సూర్య ఆరాధన చేస్తే మంచిది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని