Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16-10-2021)

తాజా వార్తలు

Published : 16/10/2021 03:59 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (16-10-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.

కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ఇష్టదైవ ప్రార్థన మంచిది.

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

బుద్ధిబలంతో కొన్ని వ్యవహారాలలో సమస్యలను అధిగమించగలుగుతారు. మనస్సౌఖ్యం ఉంది. మనోల్లాసం కలిగించే ఘటనలు చోటుచేసుకుంటాయి. బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది.
 

ధర్మసిద్ధి కలదు. బుద్ధిబలం బాగుంటుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇష్ట దైవ దర్శనం శుభప్రదం.
 

కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు. భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. శివనామస్మరణ శుభప్రదం.  

కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే  బాగుంటుంది.

శుభసమయం. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థికసాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉన్నత పదవీ యోగం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

 

మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

మిశ్రమకాలం. బాగా ఆలోచించి పనులు చేయాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

మనస్సౌఖ్యం కలదు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని