close

తాజా వార్తలు

Updated : 19/04/2021 08:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Horoscope: ఈ రోజు రాశి ఫలం

డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.  కుటుంబ సౌఖ్యం కలదు. దైవ బలం విశేషంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాల్లో అశ్రద్ధ వద్దు. నవ గ్రహ శ్లోకాలు చదవాలి.

సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. ఆలోచించి ఖర్చుపెట్టాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మంచి జరుగుతుంది.

సమయానుకూలంగా ముందుకు సాగాలి. ఆలోచనలే పెట్టుబడిగా లాభాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కలహాలకు దూరంగా ఉండండి. దత్తాత్రేయ స్వామి వారి సందర్శనం వల్ల మంచి జరుగుతుంది.

ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనో విచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. గురు శ్లోకం చదవాలి.

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. విష్ణు నామస్మరణ ఉత్తమం.

వృత్తి, వ్యాపారాల్లో మధ్యమ ఫలితాలున్నాయి. స్థిర చిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. ఆవేశాలకు పోకూడదు. నవ గ్రహ శ్లోకాలు చదివితే మంచిది.

మనో ధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. గణపతి సందర్శనం  మంచినిస్తుంది.

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థాన చలనం సూచితం. కీలక వ్యవహారాల్లో  ఓర్పుగా వ్యవహరించండి. శివ నామాన్ని జపించాలి.

ముఖ్య విషయాల్లో పెద్దల సహకారం తీసుకోవడం ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. శని ధ్యానం శుభప్రదం.

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలక చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని