Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-10-2021)

తాజా వార్తలు

Updated : 19/10/2021 06:34 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19-10-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ మీ రంగాల్లో విజయ పరంపర కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.

శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. గణపతి స్తోత్రం పఠించడం మంచిది.

అర్థలాభం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేయండి. ఆపదలు తొలుగుతాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం.

ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

ప్రారంభించిన పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. నవగ్రహ స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.

ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

ఎలాంటి  పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. బుద్ధిబలంతో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగించేవారు ఎదురవుతారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

 

మిశ్రమ కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శివారాధన శుభప్రదం.

ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

ప్రారంభించబోయే పనులు సకాలంలో నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. తోటివారి సహకారం అందుతుంది. లక్ష్మీఆరాధన శుభప్రదం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని