Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Published : 20/05/2021 03:39 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ.. ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది.

చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాలు ఒత్తిడిని పెంచుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే మేలు జరుగుతుంది. దైవారాధన మనశ్శాంతినిస్తుంది. దుర్గారాధన శుభప్రదం.  

మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసమును పెంచుతుంది.  నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.  యశస్సు వృద్ధి చెందుతుంది. గోసేవ చేస్తే బాగుంటుంది.

అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. మీ మీ రంగాల్లో  ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ  కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా బాగుంటుంది.

అనుకూలమైన ఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రయాణ సౌఖ్యం ఉంది. లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవడం ఉత్తమం.

చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగకుండా చూసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.  

సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అభివృద్ధికి సంబంధించిన వ్యవహారంలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్య, వినోద సుఖం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది.

మనోబలాన్ని కోల్పోరాదు. మంచిపనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. శని ధ్యానం శుభప్రదం.

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.  

మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కొరకు చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్ట దైవారాధన శుభప్రదం.

మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంది. ఇష్టదైవ స్తుతి శక్తినిస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని