Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Updated : 21/07/2021 05:04 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి. 

మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంది. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. విష్ణు నామాన్ని జపించండి.

అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు.శివ నామాన్ని జపించండి.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. వేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

మానసికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. నారాయణ మంత్రాన్ని జపించాలి.

చేపట్టే పనులు ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం కలదు. సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శివారాధన మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.  

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థికసాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం. 

ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని