close

తాజా వార్తలు

Published : 22/04/2021 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది.

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆశించిన ఫలితాలు సొంతమవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. శని శ్లోకాన్ని పఠిస్తే అన్ని విధాలా మంచిది.

చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువివ్వడం వల్ల ఇంట గెలుస్తారు. శివారాధన శుభప్రదం.

బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

మీమీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.

చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి. బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మనోధైర్యంతో ముందుకు సాగి పనులు పూర్తిచేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు.  వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం.

శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోరు. దైవారాధన మానొద్దు.

మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన మానొద్దు.

పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఆపదలు తొలగడానికి గోవింద నామాలు చదివితే బాగుంటుంది.

ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. దైవబలం ఉంది. ఇష్టదైవారాధన శుభప్రదం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని