Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Published : 22/07/2021 04:22 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. దుర్గాదేవి శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.

తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆపదలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఇష్టదేవతాస్తుతి శుభప్రదం.

ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.

అదృష్టం వరిస్తుంది. లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతారాధన సత్పలితాలను ఇస్తుంది.

ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. మనోబలం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈశ్వర దర్శనం శుభప్రదం.
 

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి. మంచి జరుగుతుంది.

చిత్తసౌఖ్యం ఉంది. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. సమయాలు తగ్గుతాయి. లక్ష్మీదర్శనం శుభప్రదం.

గ్రహబలం మిశ్రమంగా ఉంది. చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది.

మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మంచి పనులు చేపడతారు.గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ చుట్టూ సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కలదు. దైవబలం విశేషంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం ఉత్తమం.

తోటివారి సహకారంతో సత్పలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇష్టదైవం నామాన్ని జపిస్తే  మేలైన ఫలితాలు వస్తాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని