Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Published : 23/06/2021 04:36 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

కుటుంబ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది

మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.

మనస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం.

కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. ఒక విషయంలో మనః సంతోషాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా మేలు జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధనా శుభప్రదం.

శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది.

మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చుచుకోవాలి. చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది.

కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి మధుర క్షణాలను పొందుతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

మీ మీ రంగాల్లో  జాగ్రత్తగా పనిచేయాలి. మనోబలం సడలకుండా జాగ్రత్తపడాలి. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బంధుసహకారం ఉంటుంది. శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి.

ఒక శుభవార్త మీ ఇంట్లొ సంతోషాన్ని నింపుతుంది. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవత స్తోత్రం చదివితే బాగుంటుంది.

అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉత్సాహవంతంగా వాతావరణం ఉంటుంది.  ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు.

కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి సహాయం అందుతుంది. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని