Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24/09/21)

తాజా వార్తలు

Published : 24/09/2021 04:44 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (24/09/21)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మంచి ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.  

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

గ్రహబలం అనుకులిస్తోంది. అభివృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.

సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మంచిది. 

కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. కాలం అన్నివిధాలుగా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రం పఠిస్తే మంచిది.

 

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కొత్తవస్తువులు కొంటారు. ఆంజనేయుడిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులను కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు.   బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ ఆరాధన మంచిది.

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని