Horoscope July 25 2021: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందో చూశారా!

తాజా వార్తలు

Updated : 25/07/2021 07:05 IST

Horoscope July 25 2021: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందో చూశారా!

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

వృత్తి,వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆర్ధికంగా బాగుంటుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఆపదలు తొలగాలంటే వెంకటేశ్వరుణ్ణి  పూజించాలి.

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లక్ష్మీస్తుతి పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

మీ ప్రతిభకు పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది. 

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.

చిరస్మరణీయ విజయాలు సొంతం అవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దుర్గ ధ్యాన శ్లోకం చదవండి.

ఒక ముఖ్యమైన విషయంలో  మీరు ఆశించినదాని కంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు  ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మానసిక సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

 

మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని