Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Updated : 26/06/2021 05:01 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

 - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

ఇష్టకార్యసిద్ధి ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్య నిర్ణయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే మంచిది. 

చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో పొరపొచ్చాలు రాకుండా చూసుకోవాలి. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది.అపార్ధాలకు తావులేకుండా వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.

మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శించే వారి మాటలను పట్టించుకోవద్దు. ఒత్తిడిని దరిచేరనీయకండి. ఇష్ట దైవారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. లక్ష్మీకటాక్ష సిద్ధి కలుగుతుంది. అదృష్టవంతులవుతారు. శ్రేష్ఠమైన జీవితం లభిస్తుంది. వ్యాపారంలో లాభం వస్తుంది.  

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమ ఫలిస్తుంది. సమయస్ఫూర్తి తో ఆటంకాలు తొలుగుతాయి. ముఖ్య విషయాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.

విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో జయకేతనం ఎగురవేస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అష్టలక్ష్మీ దేవి దర్శనం శుభప్రదం.

ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మనసు చెప్పింది చేయండి.. శుభం చేకూరుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. దైవారాధన మానవద్దు.

మిశ్రమ వాతావరణం ఉంది. మానవ ప్రయత్నం అవసరం. దైవబలం రక్షిస్తుంది. తప్పుదోవ పట్టించేవారున్నారు జాగ్రత్త. చంచల బుద్ధితో సమస్య ప్రారంభం అవుతుంది. ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి. 

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసర ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి.. మంచి జరుగుతుంది.

మీ మీ  రంగాల్లో కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాధ్యానం శుభప్రదం.

శుభకాలం. ఏ పనులు ప్రారంభించినా త్వరగా పూర్తవుతాయి. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి.ఇష్టదైవారాధన శుభప్రదం.

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

శుభఫలితాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ముఖ్య విషయంలో అనుకున్నది దక్కుతుంది. అర్థలాభం ఉంది. లక్ష్మీధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని