Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-10-2021)

తాజా వార్తలు

Published : 26/10/2021 05:20 IST

Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-10-2021)

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

పనుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండవలసిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. దుర్గాస్తుతి పఠించాలి.

మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలు సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. రుణబాధ ఎక్కువ. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. శివాష్టకాన్ని చదివితే మంచిది .

 అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకుసాగి మంచి ఫలితాలను అందుకుంటారు. విందు వినోదాలతో కాలం గడుస్తుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభాన్ని చేకూరుస్తుంది.

శుభకాలం. మొదలుపెట్టిన  పనులను దిగ్విజయంగా  పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది.  బంధు మిత్రులతో అతి చనువు వద్దు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. శివ సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది.

శ్రమఫలిస్తుంది. తోటివారి సహకారంతో ఇబ్బందులు తొలుగుతాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మహాలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి ఆలోచించి మాట్లాడాలి  లేని యడల అపకీర్తిని మూటకట్టుకుంటారు. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం చదివితే మంచిజరుగును.

ధర్మసిద్ధి ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గంటారు. గురుశ్లోకం చదవాలి.

శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో అనుకున్నది దక్కుతుంది. తోటివారి సహకారం ఉంది. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శ్రేయోదాయకం.

 

సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనా పఠించాలి.

ఆత్మబలంతో పోరాడి విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి కలదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మంచిది

సత్ఫలితాలు ఉన్నాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. గొప్పవారిని కలుస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆదిత్య హృదయం పఠించాలి.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని