Today Horoscope: ఈ రోజు రాశి ఫలం
close

తాజా వార్తలు

Published : 28/05/2021 03:42 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి కనుక వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు. శివారాధన శుభప్రదం.

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో  ఆలస్యం జరిగే సూచనలున్నాయి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానం మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ధృడంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆంజనేయ దర్శనం చేయడం మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలవారు అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం పఠించాలి.

సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం పఠించాలి.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి, చెడులను  గమనించి ముందుకు సాగాలి. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. దైవ బలం రక్షిస్తోంది. విష్ణు సందర్శనం శుభప్రదం. 

మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. మీకు అనుకూలమైన నిర్ణయాన్ని అధికారులు తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివస్తోత్రము పఠిస్తే మంచిది.

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన మంచిది.

అనుకూల సమయం. తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. 

ఉత్సాహంగా పనిచేయాల్సిన సమయమిది. కొన్ని పనులను ప్రారంభించి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పక పోవచ్చు. వృథా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేయాలి.

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కనకధారా స్తోత్రము పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని