Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

తాజా వార్తలు

Published : 29/07/2021 05:25 IST

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

- డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. దైవబలం సదాకాపాడుతోంది. మంత్రసిద్ధి ఉంది. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది.

బంధుమిత్రులను కలుపుకోవాలి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

మీదైన రంగంలో ప్రగతిని సాధిస్తారు.  తలపెట్టిన పనుల్లో  విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.

మధ్యమ ఫలితాలున్నాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. నవమంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఈశ్వర నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుంది

చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. బందుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం.

మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే.  మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యం రక్షిస్తుంది. శని ధ్యానం  మంచి ఫలితాన్నిస్తుంది.

ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ముఖ్య విషయాల్లో అనుభవజ్ఞుల సహకారం మేలుచేస్తుంది. ఇష్టదైవ  నామాన్ని జపిస్తే  మేలైన ఫలితాలు వస్తాయి.

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం పఠించాలి.  

ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ధర్మసిద్ధి ఉంది. మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. మనస్సౌఖ్యం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు. విష్ణు నామాన్ని జపించండి.

శారీరక సౌఖ్యం కలదు. కీలక నిర్ణయాలు మేలు చేస్తాయి. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. సమస్యలు తగ్గుతాయి. లక్ష్మీదర్శనం శుభప్రదం.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని