తల్లిని కాపాడేందుకు నోటితో ఊపిరి అందించింది.. కానీ..!
close

తాజా వార్తలు

Updated : 03/05/2021 17:16 IST

తల్లిని కాపాడేందుకు నోటితో ఊపిరి అందించింది.. కానీ..!

బహ్రాయిచ్​: దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణవాయువు కోసం కొట్టుమిట్టాడుతున్న తమ వారిని చూసి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో.. అపాయమని తెలిసినా నోటితోనే ఊపిరి అందించి తమవారిని బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కొద్దిరోజుల క్రితం ఓ మహిళ తన భర్తను బతికించుకునేందుకు నోటితో శ్వాస అందిస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. అలా చేసి ప్రాణాలు బతికించుకునేందుకు ఆ మహిళ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కొద్దిసేపటికే సదరు వ్యక్తి మృతిచెందాడు.

కాగా అదే తరహా ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోనే చోటుచేసుకుంది. కుమార్తె నోటి ద్వారానే ఊపిరి అందించి తల్లి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించింది. కరోనా సోకడంతో ఓ మహిళకు చికిత్స అందించేందుకు బహ్రాయిచ్​లోని మహారాజ్‌ సుహేల్‌దేవ్‌ వైద్య కళాశాలకు తరలించారు. అయితే, అక్కడ ఆక్సిజన్​ కొరత తీవ్రంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు కూడా ప్రాణవాయువు అందటం లేదు. సదరు మహిళ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ కోసం సంప్రదించినా.. కొరత కారణంగా వారికి లభించలేదు. దాంతో అక్కడే ఉన్న కుమార్తె తన నోటితో తల్లికి ఊపిరి అందించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. అప్పటికి యువతి తల్లి కోలుకున్నా, చికిత్స ప్రారంభించే సమయానికి కాస్త ముందు ఆమె చనిపోయింది. దీంతో తన తల్లిని కాపాడుకోవడానికి ఆ యువతి చేసిన ప్రయత్నం వృథా అవడం అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని