David Warner - Rajinikanth: ఈసారి రజనీ స్టైల్‌లో వార్నర్‌ అదరగొట్టాడు!

తాజా వార్తలు

Published : 30/08/2021 01:18 IST

David Warner - Rajinikanth: ఈసారి రజనీ స్టైల్‌లో వార్నర్‌ అదరగొట్టాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోల ఫేసును స్వాపింగ్‌ చేస్తూ వార్నర్‌ సరదాగా వీడియోలు పోస్టు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. ఈసారి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ను అనుకరిస్తూ ఓ వీడియో చేశాడు. దీన్ని తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
రజనీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌ నటించిన రోబో సినిమాలోని ‘కిలిమంజారో’ పాటకు హీరోకు బదులు తన ముఖాన్ని జోడించాడు. అందులో వార్నర్ అచ్చం రజనీలాగానే కనిపిస్తాడు. ఐశ్వర్యరాయ్‌ పక్కన డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తున్నట్లుగా అందులో అలరించాడు. దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను పోస్టు చేసిన 24 గంటల్లోనే లక్ష మందికిపైగా వీక్షించారు. తన భార్యతో కలిసి నిజంగా ఈ పాటను రిక్రియేట్‌ చేస్తాడేమో అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, రజనీ స్టైల్‌లో వార్నర్‌ అలరించిన ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని