దారి తప్పిన దుప్పి ఎక్కడికి చేరిందంటే..

తాజా వార్తలు

Published : 15/07/2021 22:10 IST

దారి తప్పిన దుప్పి ఎక్కడికి చేరిందంటే..

అమరావతి: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాలలో శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి  దుప్పి ప్రవేశించింది. ఆవుదూడ గదిలోకి వెళ్లిందని భావించిన కుటుంబ సభ్యులు.. లోపల దుప్పిని చూసి అవాక్కయ్యారు. దుప్పిని లోపలే ఉంచి గదికి తాళం వేశారు. ఆత్మకూరు అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి ఆ దుప్పిని పట్టుకున్నారు. జనావాసాల్లోకి ప్రవేశించే క్రమంలో దుప్పికి గాయాలవడంతో.. అధికారులు దానికి చికిత్స అందించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కనిగిరి రిజర్వ్‌ అటవీ ప్రాంతం లేదా నర్సింహకొండ అటవీ ప్రాంతంనుంచి దుప్పి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని