అ.ని.శా కస్టడీలోకి ధూళిపాళ్ల నరేంద్ర 

తాజా వార్తలు

Updated : 01/05/2021 16:27 IST

అ.ని.శా కస్టడీలోకి ధూళిపాళ్ల నరేంద్ర 

అమరావతి: సంఘం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అ.ని.శా. కస్టడీలోకి తీసుకుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయనను శనివారం విజయవాడ తరలించారు. ఆయనతో పాటు సంఘం డెయిరీ ఎండీ, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను తీసుకెళ్లారు. వీరిని ఈ నెల 5 వరకు విచారించేందుకు అ.ని.శా. ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆ మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ తరలించారు. జైలు వద్ద తండ్రిని చూసి నరేంద్ర కుమార్తె కన్నీరుమున్నీరయ్యారు. నరేంద్ర ఉన్న కారు అద్దం తీయాలని పోలీసులను బతిమిలాడారు. అయినా పోలీసులు నుంచి స్పందన కరవైంది. తన భర్తను ఇరికించేందుకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని ధూళిపాళ్ల సతీమణి జ్యోతిర్మయి కన్నీరు పెట్టుకున్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని