AP News: ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి..

తాజా వార్తలు

Updated : 23/05/2021 15:12 IST

AP News: ఈ-పాస్‌ ఉంటేనే తెలంగాణలోకి..

కోదాడ: ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో వాహనాల నిలిపివేతతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సరిహద్దులోని కృష్ణా జిల్లా గరికపాడు వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. సూర్యాపేట జిల్లా రామాపురం చెక్‌పోస్ట్ వద్ద ఏపీ నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. కొవిడ్‌ ఉద్ధృతి దృష్ట్యా సూర్యాపేట జిల్లా సరిహద్దులో ఇవాళ్టి నుంచి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. కోదాడ మీదుగా మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తామని.. మఠంపల్లి, పులిచింతల చెక్‌పోస్టులను మూసివేస్తున్నట్లు చెప్పారు. 

కర్ఫ్యూ మినహాయింపు వేళల్లోనూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్యలోనూ అనుమతించకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో తాము వెళ్లడం లేదని.. రోజూ మాదిరిగానే వెళ్తున్నా ఈ కొత్త ఆంక్షలేంటని మండిపడుతున్నారు. ఈ-పాస్‌ ఉన్నవారినే అనుమతిస్తామంటూ తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ-పాస్‌ లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలను అనుమతిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని