Corona Effect: జర్నలిస్టులకు ఆర్థిక సాయం

తాజా వార్తలు

Updated : 26/04/2021 16:35 IST

Corona Effect: జర్నలిస్టులకు ఆర్థిక సాయం

హైదరాబాద్‌: కరోనాతో మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం ప్రకటించింది.తక్షణ సాయంగా రూ.2 లక్షలు అందజేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ వెల్లడించారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబసభ్యులు మే 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరణ ధ్రువీకరణపత్రము, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతో పాటు ఆయా జిల్లాల డీపీఆర్వోలు ధ్రువీకరించాల్సి ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించి ప్రత్యేకంగా కరోనా పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పించాలని, పాత్రికేయులందరికీ టీకా కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కరోనా బారిన పడిన జర్నలిస్టులకూ ఆర్థిక సాయం చేస్తున్నట్లు నారాయణ వెల్లడించారు. దీని కోసం వారు కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పలువురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. మరికొందరు కరోనాతో పోరాడుతున్నారు.  ఈ విపత్కర పరిస్థితుల్లో వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర మీడియా అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని