Vote For Note Case: రేవంత్‌పై ఛార్జ్‌షీట్‌

తాజా వార్తలు

Updated : 27/05/2021 17:34 IST

Vote For Note Case: రేవంత్‌పై ఛార్జ్‌షీట్‌

హైదరాబాద్‌: ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహ, మత్తయ్య, వేం కృష్ణకీర్తన్‌లపై అభియోగాలు నమోదు చేసింది.

2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని.. నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మనీలాండరింగ్‌ నేరానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఏసీబీ ఛార్జ్‌షీట్‌ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ.. నాంపల్లిలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. స్టీఫెన్‌సన్‌కు అతని ఇంట్లోనే ముడుపులు ఇవ్వజూపారంటూ బయటకొచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దీనిపై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఈ వ్యవహారంలో రేవంత్‌రెడ్డిని దర్యాప్తు సంస్థలు ప్రధాన నిందితుడిగా పేర్కొన్నాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అనంతరం ఈడీ నేడు న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని