విశాఖవాసి ఆస్తులు జప్తు చేసిన ఈడీ
close

తాజా వార్తలు

Published : 18/06/2021 19:10 IST

విశాఖవాసి ఆస్తులు జప్తు చేసిన ఈడీ

విశాఖ: ఖతార్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడిన విశాఖ వాసి సుబ్రహ్మణ్యం శ్రీనివాస్‌ పిన్నిటి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసింది. దోహాలోని అల్‌మీరా కన్జ్యూమర్‌ గూడ్స్‌ సంస్థలో శ్రీనివాస్‌ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల నుంచి శ్రీనివాస్‌ లంచం తీసుకున్నట్టు ఖతార్‌లో కేసు నమోదైంది.

 లంచం సొమ్మును భారత్‌లోని బ్యాంకులకు మళ్లించాడని ఖతార్‌ దర్యాప్త సంస్థ అభియోగం. దర్యాప్తునకు, సొమ్ము జప్తునకు సహకరించాలని ఖతార్‌.. భారత్‌ను కోరింది. ఈనేపథ్యంలో ఇటీవల విశాఖలోని సుబ్రహ్మణ్యం శ్రీనివాస్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. విశాఖ, విజయనగరంలో ప్లాట్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినట్టు  గుర్తించింది. ఖతార్‌ వినతితో ఇప్పటి వరకు రూ.88లక్షల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని