విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం: సురేశ్‌

తాజా వార్తలు

Published : 17/04/2021 01:47 IST

విద్యార్థులకు ఇబ్బందులు రానివ్వం: సురేశ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సీఎం సూచనల మేరకు విద్యార్థుల భవిష్యత్తు, భద్రతపై అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని