Vaccine: కత్తితో పొడవండి.. కానీ టీకా మాకొద్దు

తాజా వార్తలు

Published : 29/06/2021 01:39 IST

Vaccine: కత్తితో పొడవండి.. కానీ టీకా మాకొద్దు

మాకు కొవిడ్‌ సోకదన్న సంచార తెగ

తిరునల్వేలి: కరోనా​ టీకా వేసేందుకు వెళ్లిన అధికారులు ఓ సంచార తెగ చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు. తాము పక్షుల మాంసం తింటాం కాబట్టి తమకు కొవిడ్‌ సోకదని, టీకా అవసరం లేదని తెగేసి చెప్పారు. టీకా వద్దంటే వద్దంటూ వాగ్వాదానికి దిగారు. తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా నరిక్కురవార్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టీకాలు వేసేందుకు ఆ సంచార తెగ వారిని ఎలా ఒప్పించాలా? అని వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

జిల్లాలో వైరస్​ కట్టడి కోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య ఉపకేంద్రాల్లో వ్యాక్సినేషన్​ క్యాంపులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాంతో నగర ఆరోగ్య అధికారి (సీహెచ్​ఓ) సరోజ నేతృత్వంలోని ఓ ఆరోగ్య బృందం ఓ​ కాలనీ వద్ద టీకా పంపిణీకి వెళ్లింది. అయితే వారిని చూసిన అక్కడి ప్రజలు మాకు టీకా వద్దంటే వద్దంటూ వాగ్వాదానికి దిగారు. కావాలంటే కత్తి తీసుకుని మమ్మల్ని పొడవండి కానీ.. వ్యాక్సిన్లు వద్దని తెగేసి చెప్పారు. ‘టీకాలు తమకు హానీ చేస్తాయని వారు భయపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ టీకా తీసుకుని ఇద్దరు వ్యక్తులు చనిపోయారనే పుకార్లు వ్యాపిస్తున్నాయి’ అని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. 

టీకాలు వేసుకునేలా వారిని ఒప్పించేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను రెండుసార్లు వ్యాక్సిన్‌ వేసుకున్నానని సీహెచ్​ఓ వారికి వివరించారు. టీకాల వల్ల ఎలాంటి ప్రతికూలతలు ఎదురవ్వవని భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ..  ప్రజలు మాత్రం ససేమిరా అంటున్నారు. తాము పక్షుల మాంసం తింటున్నామని, తమకు కరోనా సోకదని ధీమాగా చెబుతున్నారు. కరోనా టీకాల గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ ఇలాంటి సమాధానాలు విన్న ఆరోగ్య అధికారులకు ఏం చేయాలో తోచడంలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని