విశాఖ ఉక్కు నిరసనలకు ఎన్నికల విరామం

తాజా వార్తలు

Updated : 10/03/2021 16:16 IST

విశాఖ ఉక్కు నిరసనలకు ఎన్నికల విరామం

విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనకారులు చేపట్టిన జాతీయ రహదారి నిర్బంధానికి విరామం ఇచ్చారు. కూర్మన్నపాలెంలో 36 గంటల పాటు జాతీయ రహదారిని నిర్బంధించిన ఉద్యమకారులు కార్పొరేషన్‌ ఎన్నికల దృష్ట్యా నిరసనలను ఈ ఒక్క రోజు నిలిపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కూర్మన్నపాలెం కూడలి మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే.. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. నిర్వాసితులు, ఒప్పంద ఉద్యోగులతో పాటు సంస్థతో భాగస్వాములైన వారందరితో చర్చించి ఉద్యమాన్ని ఏ విధంగా ఉద్ధృతం చేయాలో కసరత్తు చేస్తున్నట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు. 

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో 27వ రోజూ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఉక్కు నిర్వాసితులు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శిబిరాల్లో రిలే దీక్షల్లో పాల్గొంటున్నారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని