మావటికి అశ్రునివాళి అర్పించిన ఏనుగు

తాజా వార్తలు

Updated : 05/06/2021 16:06 IST

మావటికి అశ్రునివాళి అర్పించిన ఏనుగు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కంటికి రెప్పలా చూసుకున్న మావటికి, ఓ ఏనుగు అశ్రునివాళి అర్పించిన ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది. కూరప్పుడకు చెందిన ప్రసిద్ధ మావటి దామోదరన్‌ నాయర్ ఇటీవల మరణించారు. 60 ఏళ్లుగా ఆయన ఏనుగులను సంరక్షిస్తున్నారు. పల్లట్ బ్రహ్మదాతన్ అనే ఏనుగుకు పాతికేళ్లుగా ఆయన సంరక్షకుడిగా ఉన్నాడు. అతడికి ఆ ఏనుగుతో అవినాభావ సంబంధం ఏర్పడింది. దీంతో నాయర్ అంత్యక్రియల్లో ఆయన్ను కడసారి చూడటానికి వచ్చిన బ్రహ్మదాతన్ కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది. కేరళలో ప్రముఖ పండుగలకు నాయర్ మావటిగా వెళ్లేవారు. ఎంతోమందిని ఏనుగు సంరక్షకులుగా తీర్చిదిద్దిన దామోదరన్‌ నాయర్‌ పలు అవార్డులు సైతం పొందారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని