TS NEWS: మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు మరో నెల పొడిగింపు

తాజా వార్తలు

Published : 22/09/2021 16:52 IST

TS NEWS: మద్యం దుకాణాల లైసెన్స్‌ గడువు మరో నెల పొడిగింపు

హైదరాబాద్‌: మద్యం దుకాణాల లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల పాటు పొడిగించింది. 2019 -21 సంవత్సరానికి రిటైల్‌ మద్యం షాపుల లైసెన్స్‌లను మరో నెలపాటు పొడిగిస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, కొత్త విధానం నేపథ్యంలో  పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎ-4 రిటైల్‌ షాపుల లైసెన్సులు ఈ ఏడాది నవంబర్‌ ఒకటో తేదీ వరకు ఉండగా.. ఆ గడవును నవంబరు నెలాఖరు వరకు పొడిగించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని