యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ ‘వీడియోస్‌’
close

తాజా వార్తలు

Updated : 16/07/2020 03:57 IST

యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్‌ ‘వీడియోస్‌’

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో షార్ట్‌ వీడియోల విభాగంలో తనదైన ముద్ర వేసిన ఫేస్‌బుక్‌... ఇప్పుడు మ్యూజిక్‌ వీడియోల విభాగంలోనూ సత్తా చాటడానికి వస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో వీడియోల ఆప్షన్‌ ఉన్నప్పటికీ... అవి సాధారణ వీడియోలు మాత్రమే. యూట్యూబ్‌ స్టయిల్‌లో మ్యూజిక్‌ వీడియోలు తీసుకురావాలని ఫేస్‌బుక్‌ చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ విభాగంలో ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. త్వరలో యూఎస్‌లో ఫేస్‌బుక్‌ మ్యూజిక్‌ వీడియోస్‌ ఆప్షన్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న యాప్‌లోనే ఓ ట్యాబ్‌గా మ్యూజిక్‌ వీడియోస్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

మ్యూజిక్‌ వీడియోస్‌ కోసం ఇప్పటికే ఫేస్‌బుక్‌ పని మొదలుపెట్టిందట. గుర్తించిన ఆర్టిస్ట్‌ల పేరు పక్కన ‘అఫీషియల్‌ మ్యూజిక్‌’ అనే పేరుతో పేజీలు సిద్ధం చేస్తోందట. వాటిలో ఆ ఆర్టిస్ట్‌ల వీడియోల (ఇప్పటికే ఫేస్‌బుక్‌ వాచ్‌లో అందుబాటులో ఉన్నవి)ను అప్‌లోడ్‌ చేసి ఇస్తుందట. అయితే ఆ ఆర్టిస్ట్‌ దానికి పర్మిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కొత్త వీడియోలు ఏమన్నా ఉంటే అప్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా వీడియో వద్దు అనుకుంటే ఆ ఆర్టిస్ట్‌ వాటిని ఫేస్‌బుక్‌ మ్యూజిక్‌ వీడియోస్‌ నుంచి డిలీట్‌ చేసేయొచ్చు.

ప్రస్తుతం యూట్యూబ్‌కు 200 కోట్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. ఇందులో 15 శాతం యూఎస్‌లోనే ఉన్నారు. గతేడాది ఆర్టిస్టులకు యూట్యూబ్‌ 300 బిలియన్‌ డాలర్లు చెల్లించింది. మరోవైపు ఫేస్‌బుక్‌కు నెలకు 260 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. దీంతో ఫేస్‌బుక్‌ మ్యూజిక్‌ వీడియోస్‌కు మంచి ఆదరణ దక్కొచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని