రైతు భిక్షాటన... రెవెన్యూ అధికారుల తీరే కారణం!

తాజా వార్తలు

Published : 26/12/2020 19:40 IST

రైతు భిక్షాటన... రెవెన్యూ అధికారుల తీరే కారణం!

తాండూరు : రికార్డులు సర్వే చేయకుండా రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ.. మంచిర్యాల జిల్లాలో ఓ రైతు భిక్షాటన చేశాడు. తాండూరుకు చెందిన రాజేంద్రప్రసాద్‌ అనే అతడు ఫ్లెక్సీ కట్టుకుని నిరసన వ్యక్తం చేశాడు. తాను కొనుగోలు చేసిన భూమిలో 3.24 ఎకరాలను... సరిహద్దు ఉన్నవారు ఆన్‌లైన్‌లో మార్చుకున్నారని ఆరోపించాడు. రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహరిస్తున్నారని పేర్కొన్నాడు. గతంలో.. కలెక్టర్‌తో పాటు తహసీల్దారుకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రికార్డులను తన పేరు మీదకు మార్చాలని డిమాండ్‌ చేశాడు. ‘‘ అధికారులు ఇష్టానుసారంగా రికార్డులు రాశారు. తెరవెనుక ఎవరో పెద్దలు ఉన్నారు. నేను 48 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నా’’ అని అతడు వివరించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని