అమెరికాలో ప్లాస్మా చికిత్సకు ఓకే 

తాజా వార్తలు

Published : 24/08/2020 23:44 IST

అమెరికాలో ప్లాస్మా చికిత్సకు ఓకే 

కరోనా పోరులో మరో మైలురాయి: ఎఫ్‌డీఏ
ఈ ప్రకటన కోసమే వేచిచూస్తున్నానన్న డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నివారణకు చికిత్స ఇప్పటివరకూ లేదు. దీనిపై ఇప్పటికే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే, వైరస్‌ సోకి, పరిస్థితి విషమంగా మారిన రోగులకు ప్లాస్మా థెరపీ ఉపయుక్తంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలోనే అత్యవసర సమయాల్లో ప్లాస్మా థెరపీ చికిత్స అందించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. దీనికి అనుమతిస్తున్నట్లు అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌డీఏ) ప్రకటించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఈ పద్ధతి ప్రభావవంతంగా పనిచేస్తోందని, వైరస్‌ నుంచి కలిగే ప్రమాదాలను ఇది అధిగమిస్తుందని ఎఫ్‌డీఏ పేర్కొంది. అంతేకాకుండా కరోనా వైరస్‌ పోరులో ఇదో మైలురాయి అని ఎఫ్‌డీఏ అభిప్రాయపడింది. ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలే కనిపించాయని..అయినప్పటికీ దీనిపై మరింత పరిశోధన కొనసాగుతుందని స్పష్టం చేసింది.

దీనిపై స్పందించిన డొనాల్ట్‌ ట్రంప్‌.. ఈ ప్రకటన కోసమే తాను ఎంతోకాలం నుంచి వేచిచూస్తున్నాని అన్నారు. కరోనా వైరస్‌ పోరులో భాగంగా ఎన్నో ప్రాణాలను కాపాడగలిగే ప్లాస్మా థెరపీని ఉపయోగించే చరిత్రాత్మక ప్రకటన చేయడం ఎంతో సంతోషంగా ఉందని విలేకరులతో అన్నారు. ప్లాస్మా థెరపీ శక్తిమంతమైందని అభివర్ణించిన ఆయన.. కొవిడ్‌ నుంచి కోలుకున్న అమెరికన్లు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

అమెరికాలో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ప్లాస్మా థెరపీ చికిత్సతోపాటు, క్లినికల్‌ ట్రయల్స్‌ చేసేందుకు ఎఫ్‌డీఏ ఇదివరకే అనుమతిచ్చింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోనూ ప్లాస్మా థెరపీ కొనసాగిస్తున్నారు. అయితే, వీటి ఫలితాలపై మాత్రం నిపుణుల్లోనే భిన్న వాదనలు ఉన్నాయి. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ సమర్థంగా పనిచేస్తోందని కొందరు వాదిస్తుంటే, వీటివల్ల కొన్ని దుష్ర్పభావాలు ఉన్నాయని మరికొందరు సూచిస్తున్నారు. ప్లాస్మా థెరపీలో ఆశించినంత ప్రయోజనాలు కనిపించలేదని దిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ థెరపీపై రోగులకు ఎలాంటి ప్రమాదం లేదని మాత్రం స్పష్టంచేశారు.

ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 57లక్షల మందిలో వైరస్‌ బయటపడగా వీరిలో లక్షా 76వేల మంది ప్రాణాలు కోల్పోయారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని