Ap News: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు

తాజా వార్తలు

Updated : 02/07/2021 19:15 IST

Ap News: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు

విజయవాడ: ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజికి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద 3.07 టీఎంసీల పూర్తి నీటి సామర్థ్యం ఉండటంతో ఆ నీటి ప్రవాహాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి ఏడు గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 

ప్రస్తుతం 8,500 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా వదులుతున్నట్టు జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఎగువన పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండటంతో 7,200 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజికి వదులుతున్నారు. నాగార్జున సాగర్‌ నుంచి 38వేల క్యూసెక్కుల మేర పులిచింతలకు నీటి ప్రవాహాలు వస్తున్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 62,446 క్యూసెక్కుల నీరు వస్తోందని ఏపీ జలవనరులశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల్లో పూర్తి నీటి నిల్వలు లేనప్పటికీ విద్యుత్‌ ఉత్పత్తి కారణంగా తెలంగాణ అధికారులు నీటిని దిగువకు వదులుతున్నట్టు స్పష్టం చేశారు. దీంతో సాగు, తాగునీటికి వినియోగించాల్సిన నీరు ప్రకాశం బ్యారేజి నుంచి వృథాగా సముద్రం పాలవుతోందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని