TS News: ఫుడ్ డెలివ‌రీ సేవ‌లు యథాత‌థం

తాజా వార్తలు

Published : 23/05/2021 09:48 IST

TS News: ఫుడ్ డెలివ‌రీ సేవ‌లు యథాత‌థం

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో నేటి నుంచి ఫుడ్ డెలివ‌రీ, ఈ- కామ‌ర్స్‌ సేవ‌లు యథాత‌థంగా కొన‌సాగ‌నున్నాయి. అత్య‌వ‌స‌ర రాక‌పోక‌లు సాగించేవారిని అడ్డుకోబోమ‌ని డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ సీపీల‌కు ఆదేశాలు అందాయి. నిన్న హైద‌రాబాద్‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ప‌లుచోట్ల ఫుడ్ డెలివ‌రీ బాయ్స్‌ను అడ్డుకొని, కొంద‌రి వాహ‌నాల‌ను సీజ్ చేయడంతో వారు ఆందోళ‌న చెందారు. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో ఆయ‌న అత్య‌వ‌స‌ర రాక‌పోక‌లు సాగించే వారిని అడ్డుకోవ‌ద్ద‌ని ట్వీట్ చేశారు. డీజీపీతో మాట్లాడి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాన‌ని వివ‌రించారు. కేటీఆర్ సూచ‌న‌తో డీజీపీ తాజా ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్ డెలివ‌రీ, ఈ- కామ‌ర్స్ సేవ‌ల‌కు ఆటంకం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని డీజీపీ వివ‌రించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని