అధికారులను అడ్డుకున్న కొవిడ్‌ పాజిటివ్ వ్యక్తులు

తాజా వార్తలు

Published : 23/04/2021 23:08 IST

అధికారులను అడ్డుకున్న కొవిడ్‌ పాజిటివ్ వ్యక్తులు

బయ్యారం: పోడు భూముల్లో చదును చేస్తున్న డ్రోజర్లను పట్టుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను కరోనా పాజిటివ్ వ్యక్తులు అడ్డుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సాంబతండాలో చోటు చేసుకుంది. పోడు భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నారనే సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి డ్రోజర్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. కాగా తండా వాసులు అధికారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలంకావడంతో తండాలో ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి హోంఐసోలేషన్‌లో ఉన్న బాధితుల్ని అక్కడకు రప్పించారు. తండావాసుల చర్యలతో ఆందోళనకు గురైన అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని