close

తాజా వార్తలు

Updated : 16/04/2021 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాజీ మంత్రి ఆజ్మీరా చందూలాల్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్‌(66) గురువారం రాత్రి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన మూడురోజుల కిందట హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందట ఆయన తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌, కేసీఆర్‌ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు శాసనసభకు, రెండుసార్లు లోక్‌సభకు చందూలాల్‌ ఎన్నికయ్యారు. 2014 లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి గెలుపొంది సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా సేవలందించారు. 
తెరాసకు తీరని లోటు: సీఎం కేసీఆర్‌
చందూలాల్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సర్పంచి నుంచి చందూలాల్‌ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ములుగు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్‌ ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా పార్టీకి, మంత్రిగా గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. చందూలాల్‌ మృతి పార్టీకి తీరని లోటని కేసీఆర్‌ అన్నారు.

చందూలాల్‌ మృతి పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చందూలాల్‌ మృతి గిరిజనులకు తీరని లోటని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్‌ అభివర్ణించారు. సుదీర్ఘకాలంపాటు గిరిజన నేతగా, గిరిజన సంక్షేమ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివి అని ఆమె అన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.



 

ఇవీ చదవండి


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని