CEO Girish Mathrubootham: సింగ నాడై పోటు శిగరత్తిల్‌ యేరు (సింగమల్లే నువ్వు శిఖరము చేరు)

తాజా వార్తలు

Updated : 23/09/2021 15:34 IST

CEO Girish Mathrubootham: సింగ నాడై పోటు శిగరత్తిల్‌ యేరు (సింగమల్లే నువ్వు శిఖరము చేరు)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన  పడయప్ప ( తెలుగులో నరసింహా) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీలో రజనీని పరిచయం చేస్తూ వచ్చే సాంగ్‌ గుర్తుందా.. ‘సింగ నాడై పోటు శిగరత్తిల్‌ యేరు శిగరతై అడిన్‌తల్‌ వానతిల్‌ యేరు’ అనే లిరిక్స్‌లో స్ఫూర్తినింపే పదాలు ఉంటాయని.. అవి తన ఫేవరెట్‌ డైలాగ్‌ అని చెప్పుకొచ్చారు ఫ్రెష్‌వర్క్స్ సీఈఓ గిరీష్ మాతృభూతం. ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వీరాభిమాని. గతంలో ఆయన రజనీకాంత్ సినిమా విడుదల రోజున ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించారు.

ఎవరీ గిరిష్‌ మాతృభూతం..?

విభిన్నమైన రంగాల్లో పనిచేసే కంపెనీలు తమ వినియోగదారులతో, ఉద్యోగులతో సంప్రదింపులు జరపడానికి అత్యుత్తమమైన మార్గాల్ని చూపించేలా ఫ్రెష్‌ వర్క్స్‌  సంస్థ పనిచేస్తోంది. గిరీష్‌ 2010లో దీన్ని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. రూ.26వేల కోట్ల విలువైన ఈ సంస్థ సేవల్ని 125 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. వీరికి అమెరికా అతిపెద్ద మార్కెట్‌. సగం ఆదాయం అక్కణ్నుంచే వస్తోంది. గతంలో గిరీష్‌కు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జోహో కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉంది.

కాగా.. ఫ్రెష్‌వర్క్స్‌ సంస్థ సెప్టెంబరు 22న ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టాక్‌ ఎక్సైంజ్‌ అయిన Nashdaq జాబితాలో చోటు సంపాదించుకుంది. ఇది తనకు గుర్తుండిపోయే రోజని గిరిష్ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘ఈ రోజు నా కల సాకారమైంది. తిరుచిరాపల్లిలో మొదలైన ఫ్రెష్‌వర్స్క్‌ కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి నాష్దక్‌ దాకా వెళ్లి అందులో చోటు సంపాదించుకుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని గిరిష్ రాసుకొచ్చారు. ఇటీవల ఆయనను మనీ కంట్రోల్‌ డామ్‌ కామ్‌ ఇంటర్య్వూ చేసింది. అందులో ఓ మహిళ రజనీకాంత్‌ సినిమాలో మీకు ఇష్టమైన డైలాగ్‌ చెప్పమని అడగగా సూపర్‌స్టార్‌ నటించిన  ‘సింగ నాడై పోటు శిగరత్తిల్‌ యేరు శిగరతై అడిన్‌తల్‌ వానతిల్‌ యేరు’పడయప్ప (తెలుగులో నరసింహ) సినిమాలోని (సింగమల్లే నువ్వు శిఖరము చేరు.. శిఖరము చేరి నింగిని కోరు’) అనే లిరిక్స్‌ తనకు ఇష్టమని చెప్పారు. ‘‘చాలా మంది శిఖరానికి చేరుకున్నాక కిందికి దిగుతారు. కానీ, రజనీ ఏం చెప్పాడంటే శిఖరాన్ని చేరాక ఆకాశాన్ని అధిరోహించాల్సిన సమయం వచ్చిందనుకోవాలన్నారు’’ అని గిరీష్‌ వివరించారు. ఈ పాటను ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు రచించగా స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించారు.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని