పదవీవిరమణ వయసు పెంపుపై గెజిట్‌ జారీ

తాజా వార్తలు

Updated : 28/03/2021 04:41 IST

పదవీవిరమణ వయసు పెంపుపై గెజిట్‌ జారీ

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయోపరిమితి పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతున్నట్లు శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వయో పరిమితి పెంపునకు సంబంధించి ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్, వైద్య చికిత్స వ్యయం పెంపు, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను సభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లులకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌నూ జారీ చేసింది. ఇటీవలే ముగిసిన బడ్జెట్‌ సమావేశాల్లో ఉభయ సభలు నాలుగు బిల్లులను ఆమోదించాయి. గవర్నర్‌ ఆమోదం అనంతరం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని