వావ్‌ శంషాబాద్‌షా

తాజా వార్తలు

Published : 02/01/2020 07:50 IST

వావ్‌ శంషాబాద్‌షా

శంషాబాద్‌లో 5500 ఎకరాల విస్తీర్ణంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. తొలుత రూ.2478 కోట్లతో నిర్మాణం ప్రారంభించారు. ప్యాసింజర్‌ టెర్మినల్‌ భవనాన్ని రూ.615 కోట్లతో లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. రెండు సరకు రవాణా టెర్మినల్‌(కార్గో)ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయాన్ని మొత్తం 31 నెలల్లో పూర్తి చేయడం ఓ రికార్డు. ప్రస్తుతం రెండో దశ విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
* భూమిపూజ ఎప్పుడు చేశారు: 2005 మార్చి 16న అప్పటి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ.
* రెండు రన్‌వేల స్వరూపం: రూ.495 కోట్లతో.. 4260 మీటర్ల నిడివి, 60 మీటర్ల వెడల్పు, 10 ఎంట్రీ పాయింట్స్‌.
* ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 22 అంతస్తుల్లో నిర్మించారు.
* తొలి అంతర్జాతీయ విమానం: 2008 మార్చి 23న ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి వచ్చిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌.
* 30 విమానాలను నిలుపుకోవచ్చు.
* 130 తనిఖీ కేంద్రాలు, 8 బదిలీ తనిఖీ కేంద్రాలు, 6 రీచెక్‌ఇన్‌ కౌంటర్స్‌ ఉన్నాయి.
* 46 ఇమ్మిగ్రేషన్‌ తనిఖీ కేంద్రాలున్నాయి. డిపార్చర్స్‌ 23, అరైవల్‌ 22, ట్రాన్సిట్‌ ఒకటి.
* పార్కింగ్‌లో 3000కు పైగా కార్లను నిలపొచ్చు.
* రోజూ రాకపోకలు సాగించే ఎయిర్‌లైన్స్‌: అంతర్జాతీయం 21, దేశీయం 8.

- న్యూస్‌టుడే, శంషాబాద్‌ గ్రామీణ


రోజూ వచ్చిపోయే విమానాలు
550
ప్రయాణికులు
60వేలు
ఏటా ప్రయాణించే వారు
2.10కోట్లుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని