పవన్‌ పర్యటన ఉల్లంఘనలపై కేసుల యోచన!
close

తాజా వార్తలు

Updated : 02/01/2020 07:36 IST

పవన్‌ పర్యటన ఉల్లంఘనలపై కేసుల యోచన!

న్యాయ సలహా కోరనున్న పోలీసులు

 గుంటూరు: రాజధాని ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న తోపులాటలు, ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ మేరకు న్యాయసలహా కోరనున్నట్లు తెలిసింది. రాజధాని రైతుల ఆందోళనలకు సంఘీభావం తెలిపేందుకు మందడం, తుళ్ళూరులో మంగళవారం పవన్‌ పర్యటించారు. పర్యటన సాగిన మార్గాల్లో జనసేన కార్యకర్తలు, రైతులు, పోలీసులకు మధ్య పలుమార్లు తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. రాజధాని ప్రాంతంలో 144వ సెక్షన్‌, 30 పోలీసు యాక్టు, జనం ఒకేచోట ప్రజలు పెద్దఎత్తున గుమికూడరాదనే నిషేధాజ్ఞలు ఉన్న నేపథ్యంలో పవన్‌ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి జగన్‌ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుకోసం సీఎం మందడం మీదుగా సచివాలయానికి వచ్చి, వెళతారని... పవన్‌ తన పర్యటన మార్గాలను మార్చుకోవాలని పోలీసులు చెప్పారు. పవన్‌ ససేమిరా అంటూ వెంకటాయపాలెం దగ్గర పోలీసులు అడ్డుగా వేసిన ఇనుపకంచెను దాటుకుని ముందుకు సాగే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా పవన్‌ రహదారిపై బైఠాయించారు. ఈ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తే ఎలా ఉంటుందని పోలీసులు యోచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని