మనోభావాల కోసం కొన్ని తప్పదు: కేసీఆర్‌

తాజా వార్తలు

Updated : 03/01/2020 06:59 IST

మనోభావాల కోసం కొన్ని తప్పదు: కేసీఆర్‌

హైదరాబాద్‌: మనిషిని కాపాడడం కోసం కఠినంగా వ్యవహరించడం తప్పుకాదని, కర్తవ్య నిర్వహణలో అది అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తూ కొన్నిచోట్ల నేర ప్రవృత్తి పెరుగుతోందని, మనుషులు మృగాళ్ల మారుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందన్నారు. ప్రజల మనోభావాలను గుర్తించి, గౌరవించి కొన్ని పనులు చేయాల్సి వస్తుందని, అది తప్పుకాదని స్పష్టంచేశారు. నేర ప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ డీజీపీ హెచ్‌జే దొర తన ఆటో బయోగ్రఫీ ‘జర్నీ థ్రూ టర్బోలెంట్‌ టైమ్స్‌’ పుస్తకాన్ని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

సమాజంలో నేర ప్రవృత్తి పెరగకుండా, నైతిక విలువలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలని అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి లాంటి ధార్మిక వేత్తలు, మాజీ డీజీపీల సలహాలతోనే పాఠ్యాంశాలను రూపొందిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో నైతిక విలువలు పెంపొందించే బోధనలను ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు తమ విలువైన భాగస్వామ్యం అందించాలని సీఎం కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని