రేపు అమరావతికి నిజనిర్ధరణ కమిటీ

తాజా వార్తలు

Published : 10/01/2020 16:22 IST

రేపు అమరావతికి నిజనిర్ధరణ కమిటీ

మహిళలపై దాడులపై స్పందించిన ఎన్‌సీడబ్ల్యూ

అమరావతి: తుళ్లూరులో మహిళల మీద పోలీసుల చర్యలపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. రేపు అమరావతికి నిజనిర్ధరణ కమిటీని పంపించనున్నట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తుళ్లూరు, మందడంతో పాటు మొత్తం 29 గ్రామాల్లో నిరసన తెలియజేస్తున్న మహిళలపై పోలీసులు ఇష్టారీతిన దాడి చేశారని, కించపరిచే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ మహిళలు ట్విటర్‌, ఆన్‌లైన్‌ ద్వారా జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినందువల్లే రేఖా శర్మ స్పందించినట్లు తెలుస్తోంది. మహిళలపై దాడిని సుమోటోగా స్వీకరిస్తూ అమరావతికి కమిటీని పంపిస్తున్నట్లు ట్విటర్‌లో రేఖా శర్మ పేర్కొన్నారు. అంతేకాకుండా మహిళలపై దాడికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌చేశారు. నిజనిర్ధరణ కమిటీ నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని