రాజధాని ఉద్యమంలో ఆగిన మరో గుండె

తాజా వార్తలు

Published : 10/01/2020 16:57 IST

రాజధాని ఉద్యమంలో ఆగిన మరో గుండె

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అట్టుడుకుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ప్రజలు ఆందోళనబాట పట్టారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమం నేపథ్యంలో శుక్రవారం ఓ మహిళా రైతు కూలీ గుండె ఆగింది. ఈ పోరాటంలో పాల్గొన్న వెంకటపాలెం గ్రామానికి చెందిన నందకుమారి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. రాజధాని తరలిపోతుందనే ఆందోళనతోనే ఆమె గుండెపోటుకు గురై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని కోసం రైతుల పోరాటంలో ఇప్పటిదాకా దాదాపు 10 మందికి పైగా రైతులు, రైతు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని