తుళ్లూరులో పోలీసుల డ్రోన్‌ పహారా

తాజా వార్తలు

Updated : 11/01/2020 11:17 IST

తుళ్లూరులో పోలీసుల డ్రోన్‌ పహారా

అమరావతి: రాజధాని ప్రాంతంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కవాతు నిర్వహించి మైక్‌లో సూచనలు చేశారు. వెలగపూడిలో టెంట్‌ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఎండలోనే కూర్చుని దీక్ష కొనసాగిస్తున్నారు. టెంట్‌ వేసేందుకు అనుమతించకపోవడంతో తుళ్లూరు గ్రామంలోని రైతులు ఓ ప్రైవేటు స్థలంలో కూర్చున్నారు. రైతులు కూర్చున్న ప్రైవేటు స్థలం వద్దకు పోలీసులు రావడంతో వారు గేటుకు తాళం వేశారు. దీంతో రైతులు కూర్చున్న ప్రైవేటు స్థలంపై పోలీసులు డ్రోన్‌ సాయంతో వివరాలు తెలుసుకుంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని