నిర్భయ దోషులను ఆ రోజే ఉరితీయాలి

తాజా వార్తలు

Published : 16/01/2020 05:27 IST

నిర్భయ దోషులను ఆ రోజే ఉరితీయాలి

జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ

దిల్లీ: నిర్భయ దోషులకు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో దిల్లీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) రేఖా శర్మ  మండిపడ్డారు. ట్రయల్‌ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లో నలుగురు దోషులను జనవరి 22నే ఉరితీయాలని రేఖా శర్మ డిమాండ్ చేశారు. నలుగురు దోషుల్లో ఒకరైన ముకేశ్‌ సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు అభ్యర్థనను సమర్పించాడు. ఈ నేపథ్యంలో జైలు నిబంధనల ప్రకారం.. క్షమాభిక్షపై రాష్ట్రపతి నుంచి అధికారిక నిర్ణయం వెలువడే వరకు ఉరిశిక్ష అమలు చేయలేమని జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ సంగీత ధింగ్రా సెహగల్‌కు దిల్లీ ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ స్పందించారు.

‘రకరకాల కారణాలను చూపుతూ దిల్లీ ప్రభుత్వం ఉరిశిక్ష అమలులో అలసత్వం ప్రదర్శిస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కోర్టు తీర్పునకు కట్టుబడి దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయాలి. ఈ విషయంలో దిల్లీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది’ అని రేఖా శర్మ వ్యాఖ్యానించారు. ముకేశ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనపై నిర్భయ తల్లి స్పందిస్తూ.. అభ్యర్థనను తిరస్కరించాల్సిందిగా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ని కోరారు. వారు ఏ కోర్టుకు వెళ్లినా వారికి ఈ నెల జనవరి 22న ఉరిశిక్ష అమలవుతుందన్న దీమా వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి..

నిర్భయ దోషుల ఉరి మరింత ఆలస్యం?

నిర్భయ దోషుల క్యురేటివ్‌ పిటిషన్లు కొట్టివేత

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని