వేతనం రూ.300.. పన్ను రూ.కోటి

తాజా వార్తలు

Updated : 16/01/2020 20:34 IST

వేతనం రూ.300.. పన్ను రూ.కోటి

థానే: అతడో రోజువారీ కూలీ. కానీ కోటి రూపాయలు పన్ను చెల్లించాల్సిందిగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడికి నోటీసులు పంపించారు. అవి చూసి నిర్ఘాంతపోవడం అతడి వంతైంది. మహారాష్ట్రలోని థానేలో ఇది జరిగింది. 
అంబివ్యాలీ ప్రాంతంలో నివసించే బావుసాహెబ్‌ అహిర్‌ అనే వ్యక్తి దినసరి కూలీ. రోజుకు రూ.300 అతడి సంపాదన. కానీ ఇటీవల ఐటీ శాఖ అధికారుల నుంచి ఒక నోటీసు అందుకున్నాడు. రూ.1.05కోట్లు పన్ను చెల్లించాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. నోట్ల రద్దు సమయంలో అతడి బ్యాంక్‌ ఖాతాలో రూ.58లక్షలు జమ అయ్యాయని వాటికి సంబంధించి ఈ పన్ను చెల్లించాల్సిందిగా ఐటీ అధికారులు నోటీసులు పంపించారు. గతేడాది సెప్టెంబరులో తొలి నోటీసును అందుకున్నట్లు తెలిపాడు. ఇప్పుడు మరోసారి నోటీసులు వచ్చాయని వాపోయాడు. అతడి పేరుతో పాన్‌ కార్డు, ఇతర పత్రాలతో బ్యాంకు ఖాతా ఉన్నట్లు అతను గుర్తించాడు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

 

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని