దొంగ ఓట్లు వేయకుండా ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ యాప్‌

తాజా వార్తలు

Published : 17/01/2020 00:26 IST

దొంగ ఓట్లు వేయకుండా ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ యాప్‌

పుర పోరులో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్న ఎస్‌ఈసీ

హైదరాబాద్‌: తెలంగాణలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. హైదరాబాద్‌లోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టనున్నట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. దీని కోసం ఈ పది పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రత్యేక పోలింగ్ అధికారిని నియమించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌తోపాటు వీడియో రికార్డింగ్ చేస్తామని.. వెబ్‌ కాస్టింగ్ లేని పోలింగ్ కేంద్రాల వద్ద మైక్రో అబ్జార్వర్లు అందుబాటులో ఉంటారని ఎస్ఈసీ తెలిపింది. ఎన్నికల నిర్వహణ కోసం 44 వేల మంది సిబ్బంది విధుల్లో ఉంటారని.. వారికి శిక్షణ ఇవ్వడం కూడా పూర్తి అయిందని ఎస్‌ఈసీ వివరించింది. తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను వాడుతున్నట్లు వెల్లడించింది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఇద్దరు యూనిఫామ్‌ పోలీసులు ఉంటారని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని