పులుల పోరాటం.. వైరల్‌ వీడియో

తాజా వార్తలు

Updated : 06/08/2020 13:17 IST

పులుల పోరాటం.. వైరల్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: జూలలో తప్ప పులిని బయట చూడగలగటం చాలా అరుదు. ఒకవేళ సఫారీకి వెళ్లినా పులి కనపడుతుందనే నమ్మకం లేదు. కానీ కొంతమంది పర్యాటకులకు రెండు పులుల్నే కాకుండా, వాటి మధ్య పోరాటాన్ని కూడా లైవ్‌లో చూసే అవకాశం దక్కంది. ఇది రెండు ఎదిగిన పులుల మధ్య ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం అని ఆ వీడియోను షేర్‌ చేసిన అటవీ అధికారి వివరించారు. భారతీయ అడవుల్లో మార్మోగే పులిగర్జనలను ఈ వీడియోలో మీరు స్పష్టంగా వినవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. 

ఒక జీపులో నుంచి తీసిన ఈ వీడియోలో భారీ ఆకారం గల రెండు పులులు ఒక దానిపై ఒకటి అరుచుకుంటున్నాయి. కొన్ని క్షణాల తరువాత వాటిలో ఒకటి రెండవ దానిపై దూకింది. దానితో వాటి మధ్య సమరం మొదలయింది. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అ భీకర పోరాటాన్ని మనం కూడా చూడవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే వాటి గర్జనలను వినవచ్చు. కేవలం నాలుగు రోజుల్లో లక్షమంది చూసిన ఈ వీడియో మీరూ చూడండి మరి...Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని